బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2024 (11:49 IST)

సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడి ఫస్ట్ లుక్ విడుదల

NTR's great grandson
సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ లుక్‌ను నేడు హైదరాబాదు లోని ప్రసాద్ ల్యాబ్‌లో వీడియో రూపంలో పరిచయం చేసారు. K. రాఘేంద్రరావు, అశ్వనీదత్ ద్వారా ఎన్టీఆర్ వీడియో లాంచ్ చేసారు. రాఘేంద్రరావు మాట్లాడుతూ, నందమూరి వంశంలో మరో శకం మొదలైంది. దర్శకుడు వైవిఎస్ చౌదరి నా శిష్యుడిగా మంచి సినిమా తీస్తాడని ఆశిస్తున్నా అన్నారు.
 
వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, నా భార్య గీత స్నేహితులు, అమెరికా ఫ్రెండ్స్ నెలకొల్పిన న్యూ టాలెంట్ రొర్స్ బ్యానర్లో తీస్తున్నాము. ఈరోజు హీరో ఎన్టీఆర్ ముని మనవడి ఫస్ట్ లుక్ ఆవిష్కరించాము. నాకు దైవం సీనియర్ ఎన్టీఆర్. ఆయన దీవెనలతో ముందుకు సాగుతున్నా. అప్పట్లో ఎన్టీఆర్‌తొ సినిమా చేయాలనుకున్నా అది సాధ్య పడలేదు.
 
ఇన్నాళ్లకు మునిమనవడితో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వేదపండితుల ఆశీస్సులతో ఎన్టీఆర్ దర్శనం పేరుతో ఈ వేడుక జరిగింది. త్వరలో సినిమా వివరాలు తెలియజేస్తాను అన్నారు.