గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2025 (17:06 IST)

లావ‌ణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Lavanya Tripathi with Sathi Leelavati team
Lavanya Tripathi with Sathi Leelavati team
వైవిధ్య‌మైన పాత్రల‌తో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు  భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. 
 
రీసెంట్‌‌గానే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం టీం చకచకా షూటింగ్‌ను ఫినిష్ చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ షెడ్యూల్‌లో  హీరో హీరోయిన్ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక నిర్విరామంగా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 
ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.