శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (18:34 IST)

విజన్ ఉన్న నాయకులకు అభినందనలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ

chandrababu, pawan, balakrishna
chandrababu, pawan, balakrishna
తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణకు అభినందనలు తెలుపుతూ మంగళవారంనాడు సాయంత్రం ఫిలింఛాంబర్ లో కేకే కట్ చేశారు. 
  
ఛాంబర్ గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం, పార్టీ (శ్రీ నారాచంద్రబాబు నాయుడు) జనసేన పార్టీ (శ్రీ పవన్ కళ్యాణ్), భారతీయ జనతా పార్టీ (శ్రీమతి దగ్గుపాటి పురందరేశ్వరి)ల కూటమికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తమ ఓటు ద్వారా ఘనమైన విజయాన్ని అందించారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆనందం వ్యక్తపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తమ అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారా.  ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి లభించిన అఖండ విజయం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ మెరుగైన జీవనం కోసం మరియు భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద హోదా కోసం ఒక మార్పును కోరుకుంటున్నారని ఈ విజయం ఒక స్పష్టమైన నిదర్శనం అని తెలియజేస్తున్నాం. 
 
ఆంధ్రప్రదేశ్కు అవసరమైనప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ తన సహకారాన్ని మరియు సేవలను అందజేస్తుంది.  ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి  సేవలను అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము మరియు కొత్త ప్రభుత్వం నుండి పూర్తి సహకారాన్ని అందుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాము 
ఆంధ్ర ప్రదేశ్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మరియు వారి సమర్థ నాయకత్వం మరియు అంకితభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నాం. 
 
అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు శ్రీ సిహెచ్. శ్రీనివాసరావు (అలియాస్ వంశీకృష్ణ యాదవ్)  గారు మా తెలుగు చలచిత్ర నిర్మాతల మండలిలో  సభ్యులుగా ఉన్నారు వీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినందుకు మా  హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము అని పేర్కొన్నారు.