Kiran abbvarapu: లవ్ లో ఉన్నవాళ్లు ఫీల్ అవ్వండి, లేని వాళ్లు ఊహించుకోండి : కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram, Yukthi Tareja
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా K-ర్యాంప్. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు K-ర్యాంప్ సినిమా నుంచి మ్యాజికల్ లవ్ సాంగ్ ..కలలే కలలే.. రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 9న ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం స్పందిస్తూ - లవ్ లో ఉన్నవాళ్లు ఫీల్ అవ్వండి, లేని వాళ్లు ఊహించుకోండి, మ్యాజికల్ మెలొడీ వస్తోంది.. అంటూ ట్వీట్ చేశారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు