Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
Vijay Deverakonda, Rashmika Mandanna
విజయ్ దేవరకండ, రష్మిక మందన్నా కాంబినేషన్ అంటే యూత్ కు క్రేజ్. వారు విదేశాలకు ఎక్కడకు వెళ్ళినా అవి సోషల్ మీడియాలో వైలర్ అవుతుంటాయి. ఇటీవలే ఇద్దరూ తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వస్తూ మాస్క్ లు ధరించినా కొందరు ఫొటోలకు ఎగబడ్డారు. కానీ వారు సున్నితంగా తిరస్కరించారు. తాజాగా వీరి కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సోమవారంనాడు హైదరాబాద్ శివార్లో షూటింగ్ మొదలు పెట్టారు.
మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రుత్యాన్. చాలా కాలం క్రితమే కథను సిద్ధం చేసుకున్నా రష్మిక డేట్స్ కుదరక వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కింది. ఇందులో ద మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇందుకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈరోజు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గీత గోవిందం, డియర్ క్రామేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబోలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే వచ్చిన కింగ్ డమ్ సినిమా పెద్దగా ఆదరణ పొందలేకపోయింది.
కాగా, 1870 నేపథ్యంలో రాయలసీమకు చెందిన కథగా దర్శకుడు రాహుల్ రాసుకున్నాడు. దానిని సరైన విధంగా ట్రీట్ మెంట్ చేసేందుకు నలుగురు రచయితలు సహకరిస్తున్నారు. సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ ఇప్పటికే బాణీలు సమకూర్చే పనిలో వున్నాడు. గీత గోవింద కు మించి రెండు మెలోడీ సాంగ్ లు వుంటాయని సూాచాయిక చెబుతున్నాడు.