శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (09:41 IST)

షూటింగులో గాయపడిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఓ చిత్రం షూటింగ్ సమయంలో గాయపడ్డారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన వీడీ 12 అనే వర్కింగ్ టైటిల్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని షూటింగు జరుపుకుంటుంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్‌నువ చిత్రీకరిస్తుండగా విజయ్ దేవరకొండకు చిన్నపాటి గాయమైంది. దీంతో చిత్ర యూనిట్ వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. 
 
అక్కడే ఫిజియోథెరపీ చేసిన తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ షూటింగులో పాల్గొన్నట్టు సమాచారం. ఇక ఈ మూవీలో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. 2025 మార్చి 28వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రం ద్వారా రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలలో వరుసగా రెండు చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటించనున్నారు.