గురువారం, 13 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 12 నవంబరు 2025 (15:56 IST)

12A రైల్వే కాలనీ చూస్తున్నప్పుడు ఎవరు విలన్ గెస్ చేయలేరు : అల్లరి నరేష్

Allari Naresh, Srinivasa Chitturi, Kamakshi
Allari Naresh, Srinivasa Chitturi, Kamakshi
అల్లరి నరేష్  అప్ కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.
 
తాజాగా లాంచ్ చేసిన “12A రైల్వే కాలనీ” ట్రైలర్‌ సినిమా టోన్‌ , మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. మిస్టరీ మర్డర్స్ సిరీస్‌ చుట్టూ తిరిగే కథలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. మూఢనమ్మకాలు, హీరోకి ఎదురైన భయానక అనుభవాలతో పాటు వాస్తవం – మానసిక భ్రమలు మరింత థ్రిల్ ని క్రియేట్ చేశాయి.  
 
దర్శకుడు నాని కాసరగడ్డ, డా. విశ్వనాథ్ రాసిన థ్రిల్లింగ్‌ కథను తెరపై సస్పెన్స్‌తో ప్రజెంట్ చేశారు. అల్లరి నరేష్‌ ఈసారి తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, ఇంటెన్స్ ఎమోషన్స్ తో అదరగొట్టారు. అతని పాత్రలోని డిఫరెంట్ లేయర్స్ కట్టిపడేశాయి.  డా. కమాక్షి భాస్కర్ల తన సహజ నటనతో కథకు ఎమోషన్ యాడ్ చేశారు. సాయి కుమార్‌ ఇన్వెస్టిగేషన్‌ యాంగిల్‌కి బలాన్నిచ్చారు. వైవా హర్ష సపోర్టింగ్‌ రోల్‌లో ఆకట్టుకున్నారు.
 
కుశేందర్‌ రమేశ్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్‌ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టెన్షన్‌ను రెట్టింపు చేసింది. ప్రొడక్షన్‌ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ట్రైలర్‌తో, “12A రైల్వే కాలనీ” పై అంచనాలు పెరిగిపోయాయి. నవంబర్‌ 21న విడుదల కానున్న ఈ సినిమా ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ...నా సామి రంగ తర్వాత మేము చాలా రకాల కథలు విన్నాము. తర్వాత అనిల్ దగ్గర మంచి కథ ఉందని చెప్పారు. నేను ఇప్పుడు వరకు చాలా జానర్స్  చేశాను కానీ ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి జానర్  ట్రై చేస్తే బాగుంటుందనిపించింది. చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ. ఏ కథ ఎటు నుంచి ఓపెన్ అవుతుంది ఎండ్ అవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా రేసి ఎక్సైటింగ్ సినిమా ఇది. అని అనిల్ గారు రైటింగ్ స్కిల్స్ నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. తను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. కంగ్రాజులేషన్స్.  ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అవుతారనేది గెస్ చేయలేరు. ఆడియన్స్ అందర్నీ చాలా థ్రిల్ చేస్తుంది .ఈ సినిమా 21వ తారీకున మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా చూసి రెండు మూడు చోట్ల మీరు జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని కోరుకుంటున్నాను.
 
కామాక్షి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం చేశారు. ఇది నా కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా అవుతుందని నమ్మకం ఉంది. మా నిర్మాతలు శ్రీనివాస్ గారికి, షో రన్నర్ అనిల్ గారికి డైరెక్టర్ నాని గారికి మా హీరో నరేష్ గారికి థాంక్యూ. ఈ నలుగురు ఈ సినిమాకి నాలుగు స్తంభాలు . వీళ్ళ నలుగురు వల్లే నేను ఈ సినిమాలో ఉన్నాను. ఈ సినిమా తర్వాత అందరూ నన్ను ఆరాధన అని పిలుస్తారనే నమ్మకం ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 21న అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
 
డైరెక్టర్ నాని మాట్లాడుతూ.. నా పేరు నాని. నవంబర్ 21 తర్వాత ఈ పేరు గట్టిగా వినిపిస్తుందని బలంగా నమ్ముతున్నాను. సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ వున్నాం, ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి హీరో నరేష్ గారికి థాంక్యూ సో మచ్. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది.  నవంబర్ 21 అందరూ థియేటర్స్ లో సినిమా చూస్తారని కోరుకుంటున్నాను.
 
షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ..  అందరికి నమస్కారం.  మంచి కథ కాన్సెప్ట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో  వస్తున్న సినిమా ఇది.  పొలిమేర సినిమాకి మీరందరు ఎంతగానో ఆదరించారు. ఇది కూడా ఒక డిఫరెంట్ సినిమా. ఈ కథని నరేష్ గారు యాక్సెప్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన లేకపోతే ఇదొక చిన్న కథగా అయిపోయేది. ఆయన ఓకే చేశారు కాబట్టి ఇంత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా చూడబోతున్నారు. నాని ఈ సినిమా తో డెబ్యూ చేస్తున్నారు. అద్భుతంగా తీశాడు.  మా నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా  ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి ఇది మంచి ట్రీట్ లా ఉండబోతుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ సర్ప్రైజ్ అయిపోయే సినిమా ఇది.
 
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ ... ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. నాకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది. నరేష్  గారికి థాంక్యూ. ఈ సినిమాలో ద బెస్ట్ మెలోడీస్ చేశాను. నవంబర్ 21న థియేటర్స్ లో సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.  
 
నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి