శుక్రవారం, 17 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2025 (13:47 IST)

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Sudheer Babu's Jatadhara trend set song
Sudheer Babu's Jatadhara trend set song
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా నటించిన చిత్రం జటాధార. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు. బేచులర్ కు ఫుల్ స్టాప్ పెట్టరా... ట్రెండ్ సెట్ చేయరా.. అంటూ సాంగ్  సాగుతుంది. ఇందులో సుధీర్ బాబు డాన్స్ ప్రత్యేక సంతరించుకుంది. సరికొత్తగా డాన్స్ లో కనిపించారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా నవంబర్ 7, 2025 నుండి థియేటర్లలో తెలుగు & హిందీలో  విడుదల కాబోతుంది.
 
వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో శివన్ నారంగ్‌తో పాటు ప్రముఖ నిర్మాత ప్రేరణా అరోరా నిర్మిస్తున్న ఈ మూవీతో సూపర్ నేచురల్ ఫాంటసీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జటాధర ఇప్పటికే తెలుగు, బాలీవుడ్ రెండింటిలోనూ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్. 
 
ఫస్ట్ లుక్ పోస్టర్ సుధీర్ బాబుని పవర్ ఫుల్, స్ట్రాంగ్ అవతార్ లో ప్రెజెంట్ చేసింది. సుధీర్ బాబు తన చేతిలో త్రిశూలంతో శివుని రూపం ముందు నిలబడి ఉన్నారు. సిక్స్-ప్యాక్ అబ్స్‌ తో మాచోలా కనిపించారు.