కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్
Bellamkonda Sai Srinivas, Anupama Parameswaran, Kaushik Pegallapati, Sahu Garapati
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ థ్రిల్లర్ చిత్రం కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
'ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం' అనే డైలాగులతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో, హీరోయిన్ సహా కొంతమంది స్నేహితుల ఆత్మలని అన్వేషిస్తూ సువర్ణ మాయ ఇంటిలోకి వెళ్తారు. అక్కడ వారు ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదురుకావడం మైండ్ బ్లోయింగ్ థ్రిల్ ని అందించాయి.
దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఒక యూనిక్ హారర్ థ్రిల్లర్ ని ప్రజెంట్ చేశారు. మిస్టరీ, టెర్రిఫిక్ విజువల్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ట్రైలర్ క్లైమాక్స్‌లో అనుపమ పరమేశ్వరన్ కనిపించిన తీరు హైలెట్ గా నిలిచింది. చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, చైతన్య భరద్వాజ్ సంగీతం థ్రిల్ ని మరింతగా పెంచాయి. సెట్స్ గ్రాండ్ గా వున్నాయి. విజువల్స్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వున్నాయి. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. ఈ చిత్రానికి జి. కనిష్క క్రియేటివ్ హెడ్, దరహాస్ పాలకొల్లు కోరైటర్. మొత్తంమీద ట్రైలర్ కిష్కింధపురిపై అంచనాలని మరింతగా పెంచింది.
అనంతరం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని కిష్కింధపురి చేయడం జరిగింది. మంచి సినిమా వస్తే తప్పకుండా జనం థియేటర్స్ కి వస్తారు. అది నేను నమ్ముతున్నాను. మా కిష్కింధపురి అలాంటి సినిమానే. ఒక మంచి థియేటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. మా డైరెక్టర్ అద్భుతమైన కథ చేసుకున్నారు. మీకు ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ కూడా చూసుకునే టైం ఉండదు. అంతా అంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంత మంచి కథ తీసినందుకు డైరెక్టర్ గారికి థాంక్యూ.
మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా.రు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రార్డినరీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా నమ్మకంతో ఈ సినిమా చేశాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా నిర్మాత సాహు గారి పాషన్ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది. మా అందరికీ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనలాంటి ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి మరింత మంది రావాలి అన్నారు.
డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ... సాహు గారికి ఈ కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చెప్పారు. టెక్నికల్ గా సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. అందరూ థియేటర్స్ లో చూడండి. కచ్చితంగా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నారు.
ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా మీ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది. మా హీరో హీరోయిన్ టీమ్ అందరూ చాలా కష్టపడి పని చేశారు. వారి కష్టానికి మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా కొత్తగా చేసిన సినిమా ఇది. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మన నిర్మాత సాహు గారు చాలా ప్యాషన్ తో చాలా బిగ్ స్కేల్ లో ఈ సినిమా చేశారు. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యు. సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సెప్టెంబర్ 12 సినిమా వస్తుంది. ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్