అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ
Amma Ragin Raj, Ankita Naskar, Rohit, Esther Noronha
దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ గా పరిచయం చేస్తూ తల చిత్రం రుపొంచించారు. అంకిత నస్కర్ హీరోయిన్. '6 టీన్స్' రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ :
ట్రైలర్ లోనే అమ్మ సెంటిమెంట్ తో తల తెసినట్లు చెప్పీసారు. అమ్మ రాగిన్ రాజ్ తెనేజ్ కుర్రాడు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ఆమె కోరిక మేరకు దూరమైన తన తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ క్రమంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ క్రమంలో ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. కాగా, వెతికి పట్టుకున్న తన తండ్రి కుటుంబం లో ఉన్న సమస్య ఏమిటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరించుకున్నారు? చివరికి కథ ఎటువైపు తిరిగింది. అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
టీనేజ్ కుర్రాడుగా అమ్మ రాగిన్ రాజ్ బాగానే కనిపించాడు. అయితే బాధ్యత ఎక్కువ తెసుకున్నాడు.యాక్షన్ లో ఫ్రీడం తీసుకున్నాడు. ప్రతి ఎమోషన్, నటన లో తనదైన శైలిలో మెప్పించాడు. హీరోయిన్ అంకిత చక్కటి నటన ఇచ్చారు. అదేవిధంగా కొంత గ్యాప్ తో వచ్చిన రోహిత్ హీరో తండ్రి పాత్రలో జీవించాడు. అదేవిధంగా ఎస్తేర్ నోరోన్హా తన పాత్ర పరిధి మేరకు నటించి ఎమోషన్ ని పండించారు. ఇక అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచారు. క్లైమాక్స్ లో ఇంద్రజ గారి క్యారెక్టర్, నటన బాగుంటాయి. సినిమాలో నటించిన ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంది.
అమ్మ రాజశేఖర్ తెసుకున్న పాయింట్ బాగుంది. లవర్ కోసం ప్రాణాలు ఇస్తున్న నేటి యూత్ కథ కాకుండా అమ్మకోసం ఇంత కష్టపడే కొడుకు కథగా తీయడం అభినంచాలి. కథనంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ విజయం సాధించారు. ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్ లో నాచురల్ గా నిర్మించారు. ఈ కాలం కి తగినట్టుగా స్క్రీన్ ప్లే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే చిత్రంలోని పాటలు, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. టెక్నికల్గా నిర్మాణపరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి విలువలతో అలాగే బిఎఫ్ ఎక్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. డిఓపి గా శ్యామ్ కె నాయుడు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలుస్తుంది. అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది.కథ, దర్శకత్వం, నటీనటుల నటన ముఖ్యంగా కొత్తవాడైనా రాగిన్ రాజ్ నటన, సాంగ్స్, డిఓపి, ఎడిటింగ్ వర్క్.బాగుంది.
అయితే కథ పరంగా అమ్మ రాజశేఖర్ చాల ఫ్రీడం తీసుకున్నారు. దానితో హీరో తో స్తాయిని మించిన యాక్షన్ చేయించాడు. ట్రైలర్ లో చూపిన విధంగా హింస ఎక్కువగా ఉంది. అమ్మ సెంటిమెంట్ తో హింస లేకుండా కథను రాసుకుంటే హీరోకు గొప్ప సినిమా అయ్యేది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో డల్ గా అనిపించాయి.
రేటింగ్: 2.75/5