ఆదివారం, 7 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (18:27 IST)

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

O.. Cheliya team with Manchu Manoj
O.. Cheliya team with Manchu Manoj
ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద ‘ఓ.. చెలియా’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయించారు.
 
‘నువ్వే చెప్పు చిరుగాలి’ అంటూ సాగే ఈ పాటను మంచు మనోజ్ విడుదల చేశారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి మంచు మనోజ్ అభినందనలు తెలియజేశారు. ఈ పాటను సాయి చరణ్ ఆలపించగా.. ఎంఎం కుమార్ బాణీని అందించారు. ఇక సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. లిరికల్ వీడియోని చూస్తుంటే మంచి ప్రేమ కథా చిత్రాన్ని అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉంది.
 
ఈ మూవీకి సురేష్ బాలా కెమెరామెన్‌గా, ఉపేంద్ర ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతోన్నారు.