శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (15:47 IST)

సాహసోపేత పోరాటాలతో ఆకట్టుకునేలా కంగువ ట్రైలర్ వచ్చేసింది

Kanguva trailer poster
Kanguva trailer poster
హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మెస్మరైజింగ్ మేకింగ్ తో 'కంగువ' ట్రైలర్ ఆకట్టుకుంది.
 
'కంగువ' ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఒక అందమైన దీవిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. రహస్యాలెన్నో ఆ దీవిలో దాగిఉన్నాయి. యుద్ధాలు, ఆక్రమణలు చేస్తూ ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే భయంకరమైన విలన్ గా బాబీ డియోల్ కనిపించారు. అతనే ఒక సైన్యం లాంటి కంగువ పాత్రలో సూర్య మేకోవర్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తోంది. నాయకుడిగా తన వారిని కాపాడుకునేందుకు కంగువ చూపించే ధీరత్వం, చేసే సాహసోపేత పోరాటాలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. భారీ నౌకలపై జరిగే యుద్ధ సన్నివేశాలు వరల్డ్ సినిమాను గుర్తుచేసేలా ఉన్నాయి. హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
 
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా 'కంగువ' అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
 
 నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు