Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని
Anupama Parameswaran, Ram potineni
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, కథ చాలా గొప్పగా ఉంటుంది. అనుపమ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ట్రైలర్ అదిరిపోయింది. ఆగస్ట్ 22న మిస్ అవ్వకుండా థియేటర్స్ లో చూడండి. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ కథలు చూస్తుంటాం. అలాగే తెలుగులో ఇలాంటి కథలు రావాలి. నేను కథ విన్నాను. ఇలాంటి నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. ఉప్మా పాప... (అనుపమ)తో రెండు సినిమాలు చేశాను. తను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి నటిగా చేయడం చాలా గ్రేట్.
చాలా అద్భుతమైన కథ. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. బాలీవుడ్ లో లాపతలేడీస్ లాంటి సినిమాలు చూస్తుంటాం. మనం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం. ఇలాంటి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్ని తప్పకుండా ప్రోత్సహించాలి. ఈ సినిమా హిట్ అయి నిర్మాతలకు చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు విజయాలు సాధిస్తే నిర్మాతలకి ధైర్యం వస్తుంది. ప్రవీణ్ తీసిన సినిమా బండి సినిమా నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో అతను మరో అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గోపీసుందర్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అనుపమ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఏ క్యారెక్టర్ ఇచ్చిన 100% ఎఫర్ట్ పెడుతుంది. తనకి సినిమా అంటే చాలా పాషన్. ఈ సినిమాలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మిస్ అవ్వకుండా చూడండి'అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించి ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు అని అన్నారు. రామ్ లాంటి ఫ్రెండు నాకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బిజీ షెడ్యూల్ లో మా కోసం వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఆంధ్ర కింగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సినిమా ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.