శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2024 (20:48 IST)

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

Divvela Madhuri
Divvela Madhuri
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్ కామన్‌ మ్యాన్‌గా జనసేన పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో పవన్ వైకాపా నేతల్లారా రండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. వైకాపా నేతగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. 
 
వైకాపా తరపున మాట్లాడారు. అంతేకానీ ఆయన ఇంకేమీ చేయలేదు. అలా వైకాపా తరపున మాట్లాడటంతో తప్పేమీ లేదు. ఆ వ్యాఖ్యలను గుర్తు పెట్టుకుని ప్రస్తుతం కేసులు పెట్టడం సరికాదని.. ఆ కేసుల సాకుతో అరెస్టులు చేస్తే మాత్రం నిరసనలు తప్పవని.. రాజాను అరెస్ట్ చేసి చూడండి అంటూ దివ్వెల మాధురి హెచ్చరించారు. 
Divvela Madhuri
Divvela Madhuri
 
దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేస్తే.. ఆయన అభిమానులు రోడ్డున పడతారని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ సర్కారుతో మాట్లాడేది లేదని.. ఏం జరిగినా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ఇంకా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించిన దివ్వెల మాధురి.. యాంకర్ కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్సుకు శ్రీనివాస్‌తో పాటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.