శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (20:30 IST)

నాక్కూడా పవన్, పురంధరేశ్వరిలకు వేసిన ఛైర్ వెయ్యండి: చంద్రబాబు (video)

Chandrababu, Pawan Kalyan
ఆయన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. కానీ ఎంతమాత్రం అహంకారం, దర్పం కనిపించవు. సాదాసీదాగా వుంటారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
 
స్టేజిపైన ఆశీనులయ్యే నలుగురికోసం కుర్చీలు వేసారు. ఆ నాలుగు కుర్చీల్లో రాష్ట్ర భాజపా అధ్యక్షులు పురంధేశ్వరి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు కూర్చున్నారు. ఐతే చంద్రబాబుకి వేసిన కుర్చీ ప్రత్యేకమైనదిగా వున్నది. దీన్ని గమనించిన చంద్రబాబు.... తనకు కూడా మిగిలినవారికి వేసిన కుర్చీనే వేయాలంటూ చెప్పారు. దాంతో సిబ్బంది వెంటనే అలాంటి కుర్చీని తెచ్చి వేసారు.