శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (16:34 IST)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

Monkey
Monkey
ఆంజనేయ స్వామి వానరరూపంలో దర్శనమిచ్చాడని భక్తులు ఓ ఆలయానికి పోటెత్తుతున్నారు. హనుమంతుడే తమను దీవించడానికి ఇలా వచ్చాడని భావించిన భక్తులు... ఈ అద్భుతమైన, అరుదైన దృశ్యాన్ని చూడడానికి పోటెత్తారు. ఎక్కడ జరిగిందో తెలియదు కాని.. ఈ వానర దృశ్యం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 
సాక్షాత్తూ ఆ ఆంజనేయస్వామే.. వానర రూపంలో వచ్చి తన ప్రతిమ దగ్గరే గద పట్టుకుని నిలబడి భక్తులకు దర్శనమిచ్చినట్లుంది. ప్రస్తుతం ఈ వీడియోలో వానరం హనుమంతుడి ఆలయంకు వచ్చింది. అక్కడున్న గదను సైతం తనచేతితో పట్టుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందొ కానీ ఒక వానరం హనుమంతుడి ఆలయానికి వచ్చింది. 
 
అంతే కాకుండా.. అక్కడున్న గదను పట్టుకుని.. స్వామి వారి విగ్రహాం దగ్గర కూర్చుంది. కాసేపటి తర్వాత వానరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఆంజనేయుడే వానరంగా వచ్చాడని అంటున్నారు.