Reel on railway platform: రైలు ఫ్లాట్ ఫామ్‌పై యువతి రీల్స్.. తమాషా వుందా? అంటూ పడిన అంకుల్! (video)
మెట్రో రైళ్లు, రైలు ఫ్లాట్ ఫామ్‌లపై రీల్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇలాంటి రీల్స్ ఎన్నో నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఫ్లాట్ ఫామ్‌లపై రీల్స్ చేయడంపై సరికాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. తాజాగా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా రీల్స్ మాత్రం ఆగట్లేదు. తాజాగా ఫ్లాట్ ఫామ్‌పై ఓ యువతి రీల్స్ చేస్తుండగా ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఫ్లాట్ ఫామ్‌పై రీల్స్ చేయడం ఏంటి? తమాషాగా వుందా? అంటూ ఆ వ్యక్తి యువతిపై మండిపడ్డాడు. ఫ్లాట్ ఫామ్‌లపై రీల్స్ చేయొద్దని వాదించాడు. అయితే ఆ యువతి వెనక్కి తగ్గలేదు. ఫ్లాట్ ఫామ్‌పై రీల్స్ చేస్తే మీకొచ్చిన తంటా ఏంటని ఆ వ్యక్తితో జగడానికి దిగింది.
ఇందుకోసం అక్కడున్న వారిని పంచాయతీకి పిలిచింది. చివరికి చేసేది లేక ఆ వ్యక్తి యువతికి సారీ చెప్పాడు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇదంతా రీల్ కోసమేనని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు.