1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 9 మే 2025 (19:20 IST)

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి.
స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.
చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి.
డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు.
కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
గమనిక: ఈ సమచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.