దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథతో ఈషా ట్రైలర్ ఉందని తెలియజేస్తున్నది. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈషా పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్,త్రిగుణ్ హీరోలుగా హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్నిహేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.
తెలంగాణలో ఆంధ్రుల ఆధిపత్యం పెరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన దృష్టి వ్యాఖ్యల తర్వాత ఈ వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో ఆంధ్రుల ప్రభావం పెరుగుతోందని అన్నారు.
ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలగడంతో పాటు బిల్లు కూడా పాస్ అవుతుంది అని ఆయన అన్నారు. లియోనెల్ మెస్సీ రాబోయే పర్యటనపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.