శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 నవంబరు 2024 (18:28 IST)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

Wedding
ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చూసేందుకు పూర్తి ఆరోగ్యంగా వున్నవారు సైతం గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఓ యువకుడు తన స్నేహితుడికి బహుమతి ఇస్తూ స్టేజిపైనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
 
పూర్తి వివరాలు చూస్తే... కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహానికి తన మిత్రులతో కలిసి వచ్చాడు వంశీ. తోటి స్నేహితులతో కలిసి వివాహ వేదికపైకి ఎక్కి గిఫ్టు ఇస్తున్నారు. ఈ క్రమంలో వంశీ కాస్త అస్వస్థతకు లోనైనట్లు అనిపించి స్నేహితుడి సాయం అడిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఐతే అతడిని పట్టుకునేలోపుగానే అతడు స్టేజిపై కుప్పకూలిపోయాడు.
 
అతడిని వెంటనే డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. మృతుడు వంశీ బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు అతడి స్నేహితులు తెలిపారు.