శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (10:27 IST)

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

jagan
సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. 2021లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని చార్జిషీటులో పేర్కొనడం జరిగింది. 
 
ఈ వ్యవహారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఉన్నారని చార్జిషీటులో నిర్దిష్టంగా ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో న్యాయ నిపుణుల సలహాను పరిశీలిస్తే... జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. 
 
అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్టు చేసి విచారణ జరపడానికి గవర్నర్‌ అనుమతి అవసరమని తెలుస్తోంది. ఇకపోతే.. సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ అక్కడి కోర్టుల్లో అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో గౌతమ్‌ అదానీ తదితరులపై కేసు నమోదు చేశారు.