మంగళవారం, 16 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (18:32 IST)

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

Atlee, Allu Arjun
Atlee, Allu Arjun
అల్లు అర్జున్ తాజా సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. దీనికోసం ప్రపంచంలో పలు లొకేషన్లను వెతుకున్నాడు దర్శకుడు. ఇప్పటికే గ్రాఫిక్స్, విజువల్ టెక్నాలజీని యు.ఎస్.కు చెందిన సంస్థలతో టై అప్ అవడం అందుకు హాలీవుడ్ స్థాయిలో సాంకేతిక సిబ్బంది, నటులు కూడా నటించబోవడం తెలిసిందే. 
 
కాగా, దర్శకుడు అట్లీ పలు లొకేషన్లను చూసినట్లు సోషల్ మీడియా ఇన్ స్ట్రాలో తెలియజేశారు. సౌదీ అరేబియాలోని అబుదాబిలో ఉన్న లివా ఎడారుల్లో అట్లీ కథకు సరిపోయే లోకేషన్ కోసం చూసినట్లు తెలియజేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.