శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (11:06 IST)

ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు : పవన్ కళ్యాణ్

pawan - dussahra
తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. శక్తి స్వరూపిణి, సర్వ శుభకారిని దర్గామాత ఆశీస్సులతో మీరు తలపెట్టే ప్రతీకార్యం విజయవంతంగా అవ్వాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ తరపున ప్రార్థిస్తున్నాం అని జనసేనాన్ని ట్వీట్ చేశారు. 
 
విజయదశమి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి : సీఎం చంద్రబాబు 
 
విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని దుర్గమ్మను వేడుకుంటున్నట్లు చెప్పారు. దసరా.. అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా సందేశమన్నారు. 
 
ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఇదే ఒరవడితో సంక్షేమాన్ని కొనసాగిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
అలాగే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారన్నారు. 'వైకాపా చెడుపై.. కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేల ఉద్యోగాలిచ్చే కంపెనీలను మళ్లీ రప్పించుకున్నాం. పోలవరం సాకారం కానుంది. రైల్వే జోన్‌ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం చేయూతనందిస్తోంది. ఇన్ని విజయాలను అందించిన విజయ దశమిని సంతోషంగా జరుపుకొందాం' అని లోకేశ్‌ తెలిపారు.