శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (15:21 IST)

బెజవాడ కనకదుర్గమ్మకు కానుకగా వజ్రకిరీటం.. భారీ విలువైన ఆభరణాలు

Diamond Crown
Diamond Crown
ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. 
 
వీరిలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించి... అమ్మవారికి కానుకగా అందజేశారు. 
 
అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. ఇంకా పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు దుర్గమ్మకు వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను కానుకగా ఇచ్చారు.  
Bejawada
Bejawada
 
ఇదిలా వుంటే దుర్గమ్మకు శుక్రవారం నుంచి ఈ కిరీటాన్ని అలంకరించనున్నారు. దీని విలువు రూ.3 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఇవాళ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు