శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (16:30 IST)

మూడో భార్యకి పెళ్ళికి ముందే పవన్ కళ్యాణ్ కడుపు చేయలేదా..? మాధురి (video)

Divvala madhuri-Duvvada Srinivas,
Divvala madhuri-Duvvada Srinivas,
ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు దివ్వెల మాధురి ఓ టీవీ షోలో రెచ్చిపోయారు. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి స్పందించారు. 
 
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెట్టారని దివ్వెల మాధురి ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తిరుమలలో తాను ఎలాంటి తప్పూ చేయలేదన్న దివ్వెల మాధురి.. చేయని తప్పునకు ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని తెగేసి చెప్పారు. మమ్మల్ని ప్రశ్నించేవారు పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ప్రశ్నించరు అంటూ మాధురి నిలదీశారు.
 
మరోవైపు తిరుమలలో తాము ఎలాంటి తప్పూ చేయలేదని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు చెప్పారు. పోలీస్ కేసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. 
 
దువ్వాడ శ్రీనివాస్ విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చాకే తాము పెళ్లి చేసుకుంటామని.. అప్పటి వరకూ కలిసే ఉంటామన్నారు. లీగల్ ప్రొసేస్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు. 
 
అలాగే తమపై వస్తున్న విమర్శలపై ఫైర్ అయ్యారు. మూడో భార్యకి పెళ్ళికి ముందే ఏపీ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడుపు చేయలేదా..? అంటూ ప్రశ్నించారు. సిగ్గు లేదా.. అంటూ లైవ్‌లో  దివ్వెల మాధురి రెచ్చిపోయారు. ఇది పవన్ కల్యాణ్‌ను చెప్పట్లేదని.. మమ్మల్ని ప్రశ్నించే వారిని అడుగుతున్నానని శ్రీనివాస్ కూడా తనదైన శైలిలో రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం వారి వ్యక్తిగతమైతే.. తమ జీవితం కూడా వ్యక్తిగతమని.. మా జీవితాల్లో తలదూర్చే అధికారం వారికి ఎవరిచ్చారని మండిపడ్డారు. 
 
జనసేన, పవన్ అభిమానులకు సిగ్గు లేదని.. తమలను బెదిరించడం ఎంతవరకు సబబు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ తరపున పవన్ ఒంటరిగా పోటీ చేయాలి కానీ.. కూటమిలో కలిపేశారని దుయ్యబట్టారు.