శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (10:05 IST)

ఆన్‌లైన్‌లో వేధింపులు.. నాతో రాకపోతే చంపేస్తానన్నాడు.. చివరికి?

suicide
స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అంటూ మహిళలపై ఆన్‌లైన్‌లోనూ వేధింపులు ఆగట్లేదు. మంగుళూరు వెలుపల ఉన్న సూరత్‌కల్‌లోని ఇడియాకు చెందిన యువతి, ఆన్‌లైన్‌లో వేధింపులను ఎదుర్కొంటూ, ప్రాణహాని సందేశాలను అందుకోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతురాలికి షరీక్ అనే వ్యక్తి నుండి సోషల్ మీడియాలో స్పష్టమైన, బెదిరింపు సందేశాలు వచ్చాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యింది. 
 
సోషల్ మీడియా మెసెంజర్ ద్వారా షరీక్ తనతో రావాలని బెదిరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.