శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (20:43 IST)

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

lord ganesh
మణికొండలోని గణేష్ పండల్ వద్ద జరిగిన వేలం పాటలో లడ్డూను విజయవంతంగా వేలం వేసిన కొన్ని గంటలకే గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించినట్లు సమాచారం. 
 
వివరాల్లోకి వెళితే.. అల్కాపురి టౌన్‌షిప్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ శ్యామ్ ప్రసాద్ విజయవంతంగా వేలం వేసి రూ.15 లక్షలకు లడ్డూను తీసుకున్నాడు. దాంతో అతని సంతోషానికి అవధుల్లేవ్. శ్యామ్ ప్రసాద్ గణేష్ పండల్ వద్ద కాసేపు డ్యాన్స్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. 
 
కొద్దిసేపటికి శ్యామ్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
 శ్యామ్‌ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.