గురువారం, 20 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (12:52 IST)

ఆరేళ్ల తర్వాత నాంపల్లి కోర్టులో పులివెందుల ఎమ్మెల్యే జగన్

jagan
వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్లెక్కారు. తనపై నమోదైన అవినీతి కేసుల విచారణలో భాగంగా, ఆయన ఆరేళ్ల తర్వాత కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. 
 
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోవ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్.. ఎన్నికల తర్వాత కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే, ఆయనను అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. పైగా, విచారణకు ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి రఘురామ్ ఎదుట జగన్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కోర్టు ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన సీబీఐ మొత్తం 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో తమను తొలగించాలని కోరుతూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా కోర్టులోనే పెండింగ్‌లో ఉన్నాయి. 
 
గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నపుడు అధికారిక కార్యక్రమాల కారణంగా జగన్ కోర్టుకు హాజరుకాకుండా వచ్చారు. ఇపుడు కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉండటంతో ఆయన విధిగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో జగన్ గురువారం కోర్టులో ప్రత్యక్షమయ్యారు.