గురువారం, 20 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (11:05 IST)

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

Allu Arjun's six pack
Allu Arjun's six pack
సుకుమార్ పుణ్యమా అని ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఫుఫ్స 2 సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అమెరికాలోని పలు లొకేషన్లను, స్టూడియోలను, సాంకేతిక సిబ్బందిని కలిసి అవతార్ సినిమాకు పనిచేసిన వారిని కలిసి తన సినిమా ఎలావుండబోతోందో హింట్ ఇచ్చాడు. అందుకోసం తన పాత్ర రీత్యా బాడీని తీర్చిదిద్దుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన జిమ్ లో కష్టపడుతున్న ఫొటోలను పెట్టి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. 
 
మరోసారి తాజాగా ఆయన జిమ్ పై కథనాలు వినిపిస్తున్నాయి. కథ ప్రకారం సిక్స్ ప్యాక్ లో కనిపించనన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండగా అనౌన్సమెంట్ తోనే ఈ సినిమాని ఓ రేంజ్ లో తీసుకెళ్లి పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. అందులో యాక్షన్ సీన్స్  చేస్తున్నట్లు సమాచారం. భారీ సినిమాగా  సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీపికా పదుకోని హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా సినిమానుంచి తప్పుకుని ఈ సినిమాలో ఆమె జేరిన విషయం తెలిసిందే.