బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మార్చి 2025 (16:28 IST)

జనసేన అమర్నాథ్ కుటుంబంపై దాడి.. మహిళను జుట్టు పట్టుకుని లాగి.. దాడి (వీడియో)

Janasena party worker
Janasena party worker
కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆండ్రంగి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జనసేన పార్టీలో పనిచేస్తున్న నాయకుడి కుటుంబంపై ఓ వర్గం వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంచాయతీ చెరువు ఆక్రమణలను తొలగించాలని కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో గాలిదేవర అమర్నాథ్ ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలిసిన ప్రత్యర్థులు అమర్నాథ్ కుటుంబంపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా గాలిదేవర రత్న కుమారి జుట్టు పట్టుకుని లాక్కుని పోవడంతో పాటు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. 
 
దాడి చేసిన వారిని సత్తింశెట్టి సూర్యనారాయణ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. కాగా, దాడి చేసిన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.