శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జులై 2024 (14:24 IST)

ఏపీ రాజకీయాల్లో సంచలనం : వైఎస్ఆర్ సతీమణితో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ!!

jc prabhakar - ys vijayamma
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని విజయమ్మ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలుకరించుకున్నారు. విజయమ్మను ఆప్యాయంగా పలుకరించిన జేసీ.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
విజయమ్మ, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉంది. దీంతో ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినట్టు సమాచారం. వీరిద్దరూ చాలాసేవు భేటీ అయ్యారు. అయితే, ఏం చర్చించుకున్నారన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలుకరించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా వీరి భేటీపై పెదవి విప్పకపోవడం గమనార్హం.