AP School Uniforms: ఏపీ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ డిజైన్లు.. ఆ లోగోలు లేకుండా.. ఫోటోలు లేకుండా..?
ఏపీ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ డిజైన్లు ఖరారైనాయి. జూన్ 12 నుంచి ఏఫీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్‌లు మారనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కొత్త యూనిఫామ్‌లకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నూతన యూనిఫామ్ డిజైన్లను ఆదిరెడ్డి శ్రీనివాస్ పంచుకున్నారు.
ఈ కొత్త దుస్తులు చూడముచ్చటగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ దుస్తులు రాజకీయ పార్టీ రంగులు లేకుండా.. ప్రభుత్వ లోగోలు లేకుండా.. రాజకీయ నేతల ఫోటోలు లేకుండా ఈ యూనిఫామ్‌లు సిద్ధం అయ్యాయి. మరోవైపు వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనుంది. దీంతో ఏపీ సర్కారుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లో యూనిఫామ్, బెల్టులు, బ్యాగ్‌లు అందించనున్నారు. అలాగే లేత ఆకుపచ్చ రంగులో స్కూలు బ్యాగులు ఉండనున్నాయి. ఈ కిట్లను జూన్ 12 నాటికి పాఠశాలలు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
యూనిఫామ్ కుట్టుకూలీ ఎంత?
ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ. 120, తొమ్మిది, పదో తరగతుల వారికి రూ. 240 చెల్లించనున్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లో ఏముంటాయ్?
పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ, బెల్ట్, షూలు, బ్యాగ్, మూడు జతల యూనిఫామ్ ఉంటాయి.