శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (21:49 IST)

సనాతన ధర్మాన్ని నమ్ముతున్నా.. ప్రాయశ్చిత్తం కోసం 11 రోజుల దీక్ష: పవన్

Pawan kalyan
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. టీటీడీ ఉద్యోగులు గత రాక్షస పాలకులకు భయపడి, తప్పిదాలపై మౌనంగా ఉండిపోయారా? అనిపిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. 
 
సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని పవన్ అన్నారు. తిరుమల లడ్డూ అంశం ప్రజా పోరాటంలో ఉన్న తన దృష్టికి రాకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి పట్ల ఇది నిజంగా ఘోర అపచారం అని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. 
 
ఈ క్రమంలో తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. గుంటూరు జిల్లా నంబూరులో కొలువై ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో రేపు (సెప్టెంబరు 22) దీక్ష ప్రారంభిస్తానని వెల్లడించారు.