గురువారం, 20 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (15:03 IST)

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

Allari Naresh Latest
Allari Naresh Latest
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న 12A రైల్వే కాలనీ ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో డిఫరెంట్ జోనర్. ఈ జోనర్‌లో ఉండే సినిమాల్లోకి నన్ను మరింత బలంగా తీసుకెళ్తుందని నమ్ముతున్నానని నరేశ్ చెబుతున్నారు. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. డా. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా అల్లరి నరేశ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. కొన్ని విషయాలు సరదాగా పంచుకున్నారు. 
 
ఇటీవలే కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, మీరు చిన్నతనం నుంచి తెలుసు అన్నారు?
అవును. నేను నాన్నగారితో సినిమాలు చేస్తుండగానే సెట్ లో చూశాను. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర మురళీ అని అసిస్టెంట్ పనిచేశారు. అక్కడికి వచ్చేది. చిన్నతనంలోనే ఆమెకు సినిమాపై ఆసక్తి. అలా ప్రస్తుతం రైటర్ కూడా డైరెక్టన్ టీమ్ లో పనిచేస్తున్నారు. 
 
రెండో సినిమాకూ ఆమెనే నాయికగా ఎంపిక చేయడానికి కారణం?
ఆమెతో మారేడిమల్లి ప్రజానీకం సినిమా చేశాను. అప్పుడు ఆమెకు సినిమాపై పేషన్ గుర్తుకువచ్చింది. నాయికగా కొన్నాళ్ళు చేశాక డైరెక్షన్ చేస్తానన్నట్లు చెప్పింది. ఇప్పుడు 12ఎ రైల్వేకాలనీకి కూడా స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొంది.
 
సెట్లో కార్మికులకు ఆరోగ్య సమస్య వస్తే డా. కామాక్షి భాస్కర్ల ట్రీట్ మెంట్ చేసింది. మరీ మీకు కూడా అవసరం వచ్చిందా?
ఓ రోజు సెట్లో కొందరికి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తితే ట్రీట్ చేసింది. ఈమే కాదు. దర్శకుడు నాని కాసరగడ్డ కూడా డాక్టరే. తను డెంటిస్ట్. కామాక్షి జనరల్ ఫిజీషియన్. అందుకే మేమిద్దం డాక్టర్లు వున్నాం. ఎవరికీ ఏమీ కాదు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. హమ్మయ్య.. ఇద్దరు డాక్టర్లు వున్నారు. మనకేం కాదు అనిపించింది. కానీ వారి మాటలను దోమలు బ్రేక్ చేశాయి. ఓసారి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తుండగా సాయంత్రానికే పెద్ద పెద్దలు దోమలు కుట్టేవి. కట్ చేస్తే, ఇద్దరికీ దోమలు కుట్టడంతో వారే ఆసుపత్రికి వెళ్ళారు. అప్పుడు అనిపించింది దోమలు కూడా ఆ మాటలు విని పగబట్టాయి అంటూ చలోక్తి విసిరారు.
 
పలు జోనర్లు చేశారు. వీటికంటే వైవిధ్యంగా ఏ తరహా పాత్ర చేయాలనుంది?
అల్లరి నరేశ్ గా అన్నీ కామెడీ కథలు వస్తున్నాయి. దానితోపాటు సీరియస్ పాత్రలు పోషించాను. అయితే వీటన్నింటికంటే నాకు మూకీ సినిమా చేయాలనుంది. కమల్ హాసన్ చేసిన పుష్పక విమానం తరహాలో నటించాలనుంది. ఎప్పటికైనా చేస్తా.