శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (12:27 IST)

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

RGV
RGV
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు తీయడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే వ్యూహం, శపథం అనే చిత్రాలను రూపొందించారు. రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ఎంత కలకలం సృష్టిస్తారో, తన వ్యాఖ్యలు, చర్యలతోనూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంటారు. 
 
ఇంకా సెటైరికల్ వీడియోలు ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కేసులు నమోదైనాయి. ఈ కేసులపై నారా లోకేష్ తాను లోకేష్‌ను ఎప్పుడూ 'పప్పుగాడు' అనే మాట అనలేదని ఆర్జీవీ అన్నారు. రాజమండ్రి జైలులో ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉన్నపుడు తాను సెల్ఫీ దిగింది వాళ్లని రెచ్చగొట్టడానికి కాదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. 
 
పప్పు గాడు అనే పదాలు తాను ఉపయోగించలేదని.. ఏ మనిషిని కానీ అలా అనను. అలాగే జగన్ గారంటే తనకు అభిమానమని ఆర్జీవీ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జగన్ అంటే అభిమానమేనని.. ఆయనంటే తనకు మంచి అభిప్రాయం వుందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కాలం నుంచి చంద్రబాబుపై వున్న అభిప్రాయం అలానే ఫార్వార్డ్ అయ్యిందని ఆర్జీవీ అన్నారు.