శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (15:19 IST)

శ్రీవారి, అమ్మవారి ఫోటోలను తొలగిస్తారా, సర్వనాశనమైపోతారు: కేంద్ర మంత్రి శోభ

Shobha Karandlaje
Shobha Karandlaje
కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా హిందువులు కానీ వారిని నియమించారని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. 
 
చివరికి తిరుమల పవిత్ర ప్రసాదమైన లడ్డూల తయారిలో కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను ఉపయోగించారని, ఇలా చెయ్యరాని పాపం చేశారని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. 
 
తిరుమల సప్తగిరులపై హిందూయేతర గుర్తులను పెట్టాలని వైఎస్ జగన్ అండ్ కో ప్రయత్నించారని, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విద్యాసంస్థల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్ల ఫోటోలు తొలగించడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, జగన్ ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని కరంద్లాజే మండిపడ్డారు. 
 
గోవింద స్వామితో పెట్టుకుంటే సర్వనాశనం ఖాయమని హెచ్చరించారు. లడ్డూలో జంతు కొవ్వును కలపడం కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా అంటూ ప్రశ్నించారు. తిరుమల లడ్డూల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు అవసరమని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన అంశం చాలా తీవ్రమైందన్నారు. 
 
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని నెయ్యి వాడారనేది వాస్తవమేనని.. తిరుపతిలో తితిజే మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ బాంబు పేల్చారు.