శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (15:03 IST)

సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు

vemireddy prashanth reddy
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈ దంపతులు సీఎం బాబుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఏపీ ప్రభుత్వం తితిదే పాలక మండలి సభ్యురాలిగా నియమించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తన భర్త, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వచ్చి సీఎంను కలిసి అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, ఆదివారం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణలు హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కానీ, ఆయనకు పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడంతో ఆయన అలిగి వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రశాంతి రెడ్డి కూడా తన భర్త వెంట అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.