శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (20:37 IST)

శనివారం.. ఆవనూనెతో దీపం.. అందులో నువ్వులు వేస్తే..?

Lord Shani
శనిదేవుడు కర్మల ఫలాలను ఇచ్చే దేవుడు అని అంటారు. శనీశ్వరుడు మాత్రమే ఓ వ్యక్తిని అతని కర్మలను బట్టి సంస్కరిస్తాడు. అతనిని శిక్షిస్తాడు. వ్యక్తి చేసే పనులను బట్టి కర్మ ఫలితాలను ఇస్తాడు. శనీశ్వర అనుగ్రహం వల్ల పాపం చేసే వ్యక్తికి శిక్ష, మంచి పనులు చేసే వ్యక్తికి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. ఇదంతా శనిదేవుని ప్రకారమే నిర్ణయించబడింది. 
 
కాబట్టి, అన్ని గ్రహాలలో, శని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం శనివారం నువ్వుల దీపం వెలిగించాలి. ఇది జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చుతుంది. శని దేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
 
శనిదేవుని అనుగ్రహం కోసం హనుమంతుడి ఆరాధన చేస్తే మంచి ఫలితం వుంటుంది. హనుమంతుని ఆరాధనతో శని దోషాలను తొలగించుకోవచ్చు. ఇందుకోసం తైలాభిషేకం చేయాల్సి వుంటుంది. ఇంకా శనివారం ఆవనూనె దీపం వెలిగించాలి. 
 
అందులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. అలాగే శని చాలీసా చదవాలి. దీని తరువాత, హనుమంతుని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా పఠించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.