శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 21 డిశెంబరు 2024 (13:44 IST)

కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తాం: వైసిపి మాజీ మంత్రి రోజా

rk roja
రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీ మంత్రి రోజా చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రోజా వైసిపి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
 
తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తూ, వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్న కూటమి నాయకులను వదిలిపెట్టబోమని అన్నారు. ఈసారి రాబోయేది జగనన్న ప్రభుత్వమేననీ, తాము అధికారంలోకి రాగానే వేధించినవారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదని, వారికి వడ్డీతో సహా కలిపి అంతా చెల్లిస్తామంటూ వ్యాఖ్యానించారు.
 
దువ్వాడ శ్రీనివాస్ పైన కేసు నమోదు
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 18వ తేదీన కేసు నమోదు చేశారు. దీంతో 41ఏ కింద కేసు నమోదు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో తమ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
 
దీంతో ఆయన తన అనుచరురాలు దివ్వెల మాధురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆయనను టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మీ వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేతల ప్రోద్బలం ఉందా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా, తన భార్య దువ్వాడ వాణికి దువ్వాడ శ్రీనివాస్ విడాకులు ఇవ్వకుండానే దువ్వాడ మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు కూడా. ఈ క్రమంలో ఇటీవల దువ్వాడ మాధురి పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.