శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2024 (22:08 IST)

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

gudiwada amarnadh
వైసిపి మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన సమాధానానికి ఎవరెలా ఫీలవుతారో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పేట్రేగిపోయి మాట్లాడిన శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ మాత్రం బోరుమంటారు. ఎందుకంటే... వాళ్లిద్దరూ ఎవరు... వారికి వైసిపి సభ్యత్వం కూడా లేదు, వారితో పార్టీకి సంబంధం ఏంటంటూ గుడివాడ అమర్నాథ్ షాకిచ్చారు.
 
కాగా సోషల్ మీడియాలో గతంలో వారు వైసిపికి అనుకూలంగా మాట్లాడే క్రమంలో వీరిద్దరూ ప్రత్యర్థులను తమ ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారు. బోరుగడ్డ అనిల్ అయితే... జగన్ అన్న ఊ అంటే... నారా లోకేష్, చంద్రబాబుల అంతుచూస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ జైల్లో వుండగా శ్రీరెడ్డి తనను క్షమించాలంటూ బహిరంగా లేఖలు రాస్తోంది. ఐతే చేయాల్సిందంతా చేసేసి సారీ చెబితే వదిలేస్తారా... ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దంటూ ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పోలీసులను కోరారు.
 
ఇప్పటికే పోలీసులు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో రెచ్చిపోయినవారిని వెతికి వెతికి మరీ అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా అబ్యూస్ పైన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావలసిన అవసరం వుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సభలో చర్చించి నియమనిబంధనలను అనుసరించి చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచన చేసారు.