శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (22:39 IST)

YS Sharmila Sensational Comments జగన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు డబ్బులు అందాయా?

Sharmila
YS Sharmila Sensational Comments సౌర విద్యుత్ ఒప్పందాల్లో పారిశ్రామికవేత్త గౌతం అదానీ నుంచి ముడుపులు అందుకున్నట్టుగా తన పేరు ఎక్కడైనా ఉందా అని వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా మాట్లాడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆమె బుధవారం మాట్లాడుతూ, అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో జగన్ రూ.1750 కోట్ల మేరకు ముడుపులు అందుకున్నట్టుగా అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారించిందన్నారు. 
 
అయితే, జగన్ మాత్రం చాలా తెలివిగా మాట్లాడుతూ, తన పేరు ఎక్కడా లేదు కదా ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా మౌనంగా ఉండటానికి కారణం ఏమిటని ఆమె ప్రశ్నించారు. గత 2021లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కాక మరెవరు అని ప్రశ్నించారు. ఆసమయంలో ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నదని, అందువల్ల చంద్రబాబుకు ఏమైనా ముడుపులు అందాయా అని ఆమె నిలదీశారు.
 
ఈ విద్యుత్ ఒప్పందం పెద్ద స్కామ్ అని, పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలను ఆమె గుర్తు చేశారు. కోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. కానీ, ఇపుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ అంశఁపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. అదానీ ఇచ్చిన ముడుపులపై టీడీపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. 
 
అదానీకి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారా? ఒప్పందం రద్దులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? లాంగ్ టర్మ్ డీల్ చేయకూడదని తెలిసినా జగన్ ఎందుకు అమలు చేశారు? జగన్ - అదానీ మధ్య ఒప్పందం ఎందుకు రద్దు చేయరు? చంద్రబాబుకు కూడా ఏమైనా డబ్బులు అందాయా? చంద్రబాబు హయాంలో చేసుకున్న అనేక ఒప్పందాలను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా అలవోకగా రద్దు చేశారని, ఇపుడు ఈ ఒప్పందం అక్రమమని తెలిసినా చంద్రబాబు మాత్రం మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు.