బాలకృష్ణకి మెంటల్ వచ్చి తుపాకీతో కాలిస్తే వైఎస్సార్ కాపాడారు: రవీంద్రనాథ్ రెడ్డి (video)
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణకు మెంటల్ వచ్చి ఎవర్నిబడితే వాళ్లను తుపాకీతో కాల్చడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైతే ఆనాటి సీఎం వైఎస్సార్ కాపాడారంటూ వైసిపి నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆనాడు బాలకృష్ణ కాల్పులు జరిపాక నాకు ఫోన్ చేసాడు. తనపై కేసు వచ్చిందనీ, తనను రక్షించాలని ఫోన్ చేసాడు. అప్పుడు నేను కడపలో వున్యా. బాలకృష్ణ ఫోన్ చేయడంతో మీ కుటుంబానికి చెందినవాళ్లను కూడా రమ్మంటే ఒక్కరూ రాలేదు. చంద్రబాబు తర్వాత రోజు వచ్చాడు. నేను వైఎస్సార్ దగ్గరకి వెళ్లి, ఈయన ఎన్టీఆర్ కుమారుడు, ఏదో మెంటల్ వచ్చి ఎవరి మీద పడితే వారి మీద కాల్పులు జరుపుతున్నాడు. మెంటల్ సర్టిఫికేట్ కూడా వుందని చెప్పడంతో ఆరోజు వైఎస్సార్ వెంటనే స్పందించి బాలకృష్ణను అరెస్ట్ చేయకుండా కాపాడారని చెప్పుకొచ్చారు.
బాలయ్య ఏమన్నారు?
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ... ఆనాడు సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందని, కానీ ఎవరూ గట్టిగా నిలదీయలేకపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు అవమానం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా, బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ తోసిపుచ్చారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని అనగా, అది సరికాదని బాలకృష్ణ అన్నారు. వాస్తవానికి ఎవరూ జగన్‌ను గట్టిగా అడగలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
అప్పట్లో సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్‌తో జరిగిన సమావేశానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, అయితే తాను ఆ సమావేశానికి హాజరు కాలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవిని సైతం పిలిచి ఆ సైకో అవమానించారు... ఆ రోజు తనను పిలిచినా తాను వెళ్లలేదని బాలయ్య అన్నారు. తన పేరును 9వ పేరుగా రాశారంటూ చెప్పుకొచ్చారు. బాలయ్య వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.