Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..
బరువును సులభంగా తగ్గించాలనుకునే మహిళలు పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. బరువు తగ్గడానికి పుదీనా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఒబిసిటీ ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మహిళలను ఈ సమస్య వేధిస్తుంది.
గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోవడం.. ఇంటి పని చేసినా సరైన వ్యాయామం లేకపోవడం ద్వారా మహిళల్లో బరువు పెరుగుదల తప్పట్లేదు. ఇందుకు జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువు కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు.
ఈ అధిక బరువును దూరం చేసుకోవాలంటే రోజువారీ డైట్లో పుదీనాను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుదీనా జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. తద్వారా శరీరంలో ఏర్పడే వాపును తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా ఆహారాన్ని మితంగా తీసుకుంటారు.
పుదీనా శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇది ఫ్యాట్ బర్న్గా పనిచేస్తుంది. పుదీనాలో కెలోరీలు తక్కువ. ఇందులో కొవ్వు తక్కువగా వుండటం ద్వారా రోజూ ఆహారంలో చేర్చుకోవడం.. ఇంకా పుదీనాను జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. పుదీనా ఆకులు గుప్పెడు తీసుకుని రెండు గ్లాసుల నీటిలో మరిగించి.. దానిని వడగట్టి తీసుకోవచ్చు. పరగడుపున పుదీనా ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు.
అలాగే పుదీనా ఆకులను అలానే నమిలి తీసుకోవచ్చు. ఇలా చేస్తే మౌత్ హెల్త్‌కు మేలు జరుగుతుంది. అలాగే పుదీనా టీ తీసుకుంటే బరువు తగ్గవచ్చు. అలాగే పుదీనాను పచ్చడి రూపంలోనూ తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. పుదీనా పచ్చడికి అల్లం, వెల్లుల్లిని తప్పకుండా తీసుకోవాలని న్యూట్రీషియన్లు అంటున్నారు.