శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (15:31 IST)

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : ప్రధాన నిందితుడు లొంగుబాటు

tdp office
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య సోమవారం ఎదుట లొంగిపోయారు. మంగళగిరి కోర్టుకు వచ్చిన చైతన్య... న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. 
 
గత వైకాపా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. అయితే, ఇటీవలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన సోమవారం లొంగిపోయాడు. వైకాపా ముఖ్య నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందిన చైతన్యను టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.