మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. శుభకార్యంలో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అధికం. పెద్దమొత్తం సహాయం తగదు. ముఖ్యుల కలయిక వీలుపడదు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. అనవసర విషయంలో జోక్యం తగదు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నేడు అనుకూలతలున్నాయి. తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్న కార్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులను ఆదుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సన్నిహితుల కలయిక వీలుపడదు. పనులు అర్థాంతంగా ముగిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. లౌక్యంగా వ్యవహరించాలి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులకు యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అధికం. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాలు సంచారం బాగుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుపరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పనులు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రయాణం తలపెడతారు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. ఒత్తిడి, ఆందోళన అధికం. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించి మెలగండి. చేపట్టిన పనులు సాగవు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒత్తిడి, ప్రలోభాలకు లొంగవద్దు.