మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. పత్రాలు అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, విరాళాలు, కానుకలు అందిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పత్రాలు ఆహ్వానం అందుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. రావలసిన ధనం సమయానికి అందదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఓర్పుతో మెలగండి. శుభవార్తలు వింటారు. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తతవుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలు చేపడతారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి గురవుతారు. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిచండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. విలాసాలకు ఖర్చు చేస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయగల్గుతారు, అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమమవుతాయి. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకుంటారు. అందరితో మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పుణ్యక్షేత్రాలు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.