శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-10-2024 మంగళవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు పనిభారం, చికాకులు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏకాగ్రతతో మెలగండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పెద్దల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అనవసర జోక్యం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణం తలపెడతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. అనుకున్నది సాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చిత్తశుద్ధితో యత్నాలు సాగించండి. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి, ఉల్లాసంగా గడుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. సన్నిహితులో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రముఖులకు సన్నిహితులవుతారు, అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడేవారి ఆంతర్యం గ్రహించండి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శుభఫలితాలున్నాయి. పురస్కారాలు అందుకుంటారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.