శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-10- 2024 బుధవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు పనులు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు కట్టడి చేయండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్యలు తొలగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. నోటీసులు అందుకుంటారు. సన్నిహితులను సంప్రదిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. వేడుకలు, విందులకు హాజరవుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబీకుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
స్వయంకృషితోనే రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. సంతానానికి శుభం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అందరిలో గుర్తింపు పొందుతారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులుల అంచనాలను మించుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అర్థికలావాదేవీలు ముగుస్తాయి, లాభసాటి నిర్ణయం తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. కుటుంబీకుల కోసం విపరీంగా ఖర్చు చేస్తారు. ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. ధార్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
పట్టుదలతో యత్నాలు సాగించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. గత సంఘటనలు మరిచిపోవద్దు. ఖర్చులు విపరీతం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. పనులు చురుకుగా సాగుతాయి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి.