మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంప్రదింపులు వాయిదా పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని పనులు అసంపూర్తిగా వదలేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వేడుకలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. అతిగా ఆలోచింపవద్దు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. నేడు సాధ్యం కానిది రేపు అనుకూలివస్తుంది. సంతానం కదలికలను గమనిస్తూండాలి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల ఆశీస్సులందుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వస్త్ర, ఫ్మాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నింటా మీదే పై చేయి. కీలక వ్యవహారాలపై పట్టు సాధిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. వ్యతిరేకులతో జాగ్రత్త. కొంతమంది మీపై నిఘా వేశారని గమనించండి. ఆదాయం బాగుంటుంది. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను సంప్రదించవద్దు. సంతానానికి శుభం జరుగుతుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయు, ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. న్యాయవాదుల ఆదాయం బాగుంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. మానసికంగా స్థిమితపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. తరచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఒక సమాచారం ఆలోచివంపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. దైవదర్శనంలో ఒకింత అవస్థలెదుర్కుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం సర్వత్రా అనుకూలం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్థిరచరాస్తి మూలకు ధనం అందుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తరచు సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. గుట్టుగా మెలగండి. కొందరు మీ ఆలోచనలనుర నీరుగార్చేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. విషయం చిన్నదే అయినా తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. గృహంలో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వశక్తితోనే అనుకున్నది సాధిస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అవతలి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఉద్యోగ విధుల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులు సామరస్యంగా మెలగాలి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహ ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదించండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అందరితోను సౌమ్యంగా మాట్లాడండి. మీ వ్యాఖ్యలు కొందరికి మనస్తాపం కలిగిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలు చేజారిపోతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి నిరాశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. దూర ప్రయాణం తలపెడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది. ఒంటరిగా కాలం వెళ్లదీయకండి. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. సంతానానికి శుభం జరుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశం లభిస్తుంది. ఉద్యోస్తులకు బాధ్యతల మార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వాహనదారులకు కొత్త సమస్య ఎదురవుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఉల్లాసంగా గడపుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఆడంబరాలకు వివపరీతంగా ఖర్చు చేస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొన్ని పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూ పోతుంటారు. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై దృష్టి సారించండి. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పదోన్నతి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార జయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం. ధనానికి లోటుండదు. అర్థాంతంగా ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, మార్పు, పనిభారం.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం కొంతమేరకు ఆశాజనకం. లక్ష్యానికి చేరవవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనుకున్న ఖర్చులే ఉంటాయి. ధనానికి లోటుండదు. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. ధనసహాయం తగదు. పనులు వేగవంతమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రలోభాలకు గురికావద్దు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా తీసుకోండి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. మరోసారి యత్నించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం బాగుంది. సమయస్ఫూర్తితో మెలుగుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ధనసహాయం, మధ్యవర్తిత్వం తగదు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలడుతుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.