శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (22:32 IST)

01-10-2024 నుంచి 31-10-2024 వరకు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఫలించవు. బంధుమిత్రులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. వస్త్ర, పచారీ, ఫ్యాన్నీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులకు పనిభారం, సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక విషయాల్లో చాకచక్యంగా మెలగాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానానికి శుభయోగం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, కీలక పత్రాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషిండి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెళకువ వహించండి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక స్థానచలనం. దైవదర్శనాల్లో ఒకింత అవస్థలు తప్పవు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంకల్పం సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానానికి శుభయోగం. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో తరుచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత ప్రధానం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. బంధువుల మాటతీరు కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. అధికారులకు బాధ్యతల మార్పు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ రంగంలో ఆశించిన ఫలితాలున్నాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. దూరప్రయాణం తలపెడతారు. దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు.
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. సొంత నిర్ణయాలు తగవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యతలోపం. సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. వివాహయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్ని ఇస్తుంది. పట్టుదలతో వ్యవహరిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
ధనరాశి : మూల, పూర్వాషాఢ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ మాసం ప్రతికూలతలు అధికం. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆత్మీయులను విందులు, వేడుకలకు ఆహ్వనిస్తారు. ఖర్చులు భారమనిపించవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలు, అనుమానాలకు తావివ్వవద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. శంకుస్థాపనలు, గృహప్రవేశాలను అనుకూలం. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం ద్వితీయార్ధం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం మందగిస్తుంది. సొంతన పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానానికి శుభయోగం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. యోగ, ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం.